: బిడది ఆశ్రమానికి సెలవు...ఇక రాను: నిత్యానంద


వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద బిడది ఆశ్రమానికి వీడ్కోలు పలకనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయనకు పుంసత్వ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షల్లో ఆయన మగాడేనని, అతనికి మగతనం ఉందని వెల్లడైంది. గతంలో తాను నపుంసకుడినని, తనకు మగతనం లేదని పలు సందర్భాల్లో ఆయన ప్రకటించారు. ఆయనకు మగతనం ఉందని, కోరికలకు అతీతుడు కాడని పరీక్షల్లో వెల్లడవడంతో కంగుతిన్న నిత్యానంద స్వగ్రామానికి పయనమవుతున్నారు. బిడది వద్ద 2003లో ధ్యాన పీఠం ఆశ్రమం స్థాపించిన నిత్యానంద సినిమా నటి రంజితతో రాసలీలల సీడీ వెలుగులోకి వచ్చేవరకు అప్రతిహతంగా బోధనలు సాగించారు. అప్పటి నుంచి వెల్లువెత్తిన వివాదాలు, పోలీస్ కేసులు, అత్యాచారం ఆరోపణలతో ఆయన వివిధ సంఘాల నిరసనలను ఎదుర్కొన్నారు. తాజా పరీక్షల తరువాత ఇంకెంత ఆందోళన ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుందో అని భయపడ్డ ఆయన, బెంగళూరును వదిలాలని నిర్ణయించారు. స్వగ్రామం తమిళనాడులోని తిరువణ్ణామలై వెల్లిపోయి అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆశ్రమంలో ఈ ఉదయం ప్రవచనాల సందర్భంగా బిడదిని వదిలి తిరువణ్ణామలైకు వెళ్లిపోవాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. ఇకెప్పుడూ ఈ ఆశ్రమానికి రానని, కేవలం కోర్టు కేసులకు మాత్రం హాజరవుతానని ఆయన స్పష్టం చేశారు. నిత్యానంద ఆ ప్రకటన చేసినప్పుడు మానసికంగా బాగా కుంగిపోయినట్లుగా భక్తులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News