: సానియా మీర్జాకు సన్మానం చేస్తాం: కేసీఆర్


టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు తెలంగాణ ప్రభుత్వం తరపున సన్మానం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సానియా మీర్జా ముఖ్యమంత్రిని ఈ రోజు హైదరాబాదులో కలిసిన సందర్భంలో మాట్లాడుతూ, సానియాను క్రీడాకారులు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సానియా మీర్జాకు అవసరమైన సాయం అందిస్తామని కేసీఆర్ తెలిపారు. తనను ప్రోత్సహించినందుకు కేసీఆర్ కు సానియా మీర్జా ధన్యవాదాలు తెలిపారు.

  • Loading...

More Telugu News