: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన షూమాకర్
ఫార్ములా వన్ మాజీ ఛాంపియన్ మైఖేల్ షూమాకర్ స్విట్జర్లాండ్ లోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. స్కీయింగ్ చేస్తూ తీవ్రగాయాలపాలైన షూమాకర్ సుదీర్ఘకాలం కోమాలో ఉన్న సంగతి తెలిసిందే. గత నెలలో స్పందించిన ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నారు. దీంతో ఆయనకు ఇకపై ఇంట్లోనే చికిత్స కొనసాగించాలని వైద్యులు నిర్ణయించారు.