: మార్కెట్లో 155 సీసీ బైక్ సుజుకి 'జిగ్గర్'
సుజికి సంస్థ కొత్త బైక్ తో మార్కెట్లో రంగప్రవేశం చేసింది. సుజికి 'జిగ్గర్' మోడల్ బైక్ తో ద్విచక్రవాహన తయారీ సంస్థ సుజికి మోటార్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ఇతర ద్విచక్రవాహనాలకు పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. సుజికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ గుప్తా, సేల్స్, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ కెన్జీ హీరాజవా సుజికి 'జిగ్గర్' ను విడుదల చేశారు. 155 సీసీ సామర్థ్యం గల 'జిగ్గర్' ధర 72,199 రూపాయలుగా సుజికి సంస్థ నిర్థారించింది. ఈ ధరకు ట్యాక్సులు అదనం.