: అంగరంగ వైభవంగా ముగిసిన ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం
ఖైరతాబాద్ గణపయ్యకు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. 60 అడుగుల భారీ వినాయక విగ్రహం నిమజ్జనానికి మేళతాళాలతో వెళ్లింది. 20 గంటలపాటు అంగరంగ వైభవంగా సాగిన శోభాయాత్ర నిమజ్జన స్థలానికి చేరుకోవడంతో ముగిసింది. ఉత్సవ కమిటీ తుది పూజలు చేసిన అనంతరం భారీ క్రేన్ల సాయంతో గణపతి జల ప్రవేశం జరిగింది. దీంతో రెండు రోజులపాటు హైదరాబాదులో సాగిన వినాయక నిమజ్జన కార్యక్రమం పూర్తయింది.