: ఏడుకొండల వాడా...ఆపద మొక్కుల వాడా, మమ్మల్ని ఆదుకో!: ఆర్టీసీ కార్మికుల వినతి


ఆర్టీసీని ఆదుకోవాలని 300 మంది ఆ సంస్థ కార్మికులు శ్రీ వెంకటేశ్వరుణ్ణి వేడుకునేందుకు కాలినడకన తిరుమల చేరుకున్నారు. ఆర్టీసీని కాపాడు అంటూ శ్రీవారి నామస్మరణ చేస్తూ కొండమీదికి చేరుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వ విలీనం చేసుకోవాలని, తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ మేరకు ఓ వినతి పత్రాన్ని శ్రీవారి హుండీలో వేశారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 11 నుంచి సమ్మెకు దిగుతామని, సమ్మె అనివార్యమైతే తిరుమలకూ బస్సులు నిలిపేస్తామని వారు హెచ్చరించారు. కాగా, అంతకు ముందు ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి.

  • Loading...

More Telugu News