: బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శిగా నద్దా
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శిగా ఆ పార్టీ సీనియర్ నేత జేపీ నద్దా నియమితులయ్యారు. కేంద్ర మంత్రి అనంత కుమార్ స్థానంలో నద్దాను నియమిస్తున్నట్టు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో పార్టీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో 15 మంది సభ్యులతో కూడిన కేంద్ర ఎన్నికల కమిటీ ప్రధాన భూమిక పోషిస్తుంది. ఈ కమిటీలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ సభ్యులు. కాగా, ఈ కమిటీలో బీజేపీ సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీలకు స్థానం లభించకపోవడం విశేషం.