: నేనే కాదు, నా తాత జేజమ్మ కూడా తెలంగాణలో ప్రస్తుతం కరెంట్ కష్టాలు తీర్చలేదు: కేసీఆర్


కాళోజి శతజయంతి సందర్భంగా వరంగల్ లో జరిగిన సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తానెప్పుడూ జీవితంలో అబద్ధపు హామీలు ఇవ్వలేదని ఆయన ప్రకటించారు. మూడేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం కరెంట్ కష్టాలు అనుభవించాల్సిందేనని ఎన్నికల సమయంలోనే ప్రజలకు తెలిపానన్నారు. ప్రస్తుతం తాను కాదు కదా.... తన తాత జేజమ్మ కూడా తెలంగాణ కరెంట్ కష్టాలు తీర్చలేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, మూడేళ్ల తర్వాత మాత్రం 'కనురెప్ప మూసే సమయం' కూడా తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ పోనివ్వని ఆయన హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News