: మహబూబ్ నగర్ జిల్లాలో పోలీసులపై దాడి చేసిన గ్రామస్తులు
మహబూబ్ నగర్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచ గ్రామస్తులు పోలీసులపై దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే, ఈ ఉదయం అవంచలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అవంచకు చేరుకున్నారు. అసలే ఆగ్రహంతో ఉన్న మృతుడి వర్గీయులు పోలీసులపై దాడి చేశారు. పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.