: ఎట్టకేలకు ప్రారంభమైన ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర


ఎట్టకేలకు ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. సుమారు 11 గంటల ప్రాంతంలో ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చారు. వాస్తవానికి ప్రతీ ఏడాది నిమజ్జనం రోజు అర్ధరాత్రి ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రను ప్రారంభించి ఉదయానికల్లా నిమజ్జనాన్ని ముగించేవారు. అయితే, ఈసారి హైదరాబాద్ లో గణనాథుల సంఖ్య ఎక్కువ కావడంతో... నిమజ్జన రద్దీ ఈ ఉదయం వరకు చాలా ఎక్కువగా ఉంది. ఈ కారణంగా వేలాదిమందితో సాగే ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైతే... ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయన్న ఉద్దేశంతో పోలీసులు ఈ శోభాయాత్రకు ఈ ఉదయం పదకొండు గంటల వరకు అనుమతి ఇవ్వలేదు.

  • Loading...

More Telugu News