: శారదా స్కాంలో సీఎం మమతపై ఆరోపణలు... కాపాడేందుకు తృణమూల్ యత్నం


సంచలనం సృష్టించిన శారదా చిట్ ఫండ్ స్కాంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సంబంధం ఉందంటూ తీవ్ర ఆరోపణలు రావడంతో... ముఖ్యమంత్రి పదవి నుంచి ఆమె వైదొలగాలన్న డిమాండ్లు వస్తున్న సంగతి తెలిసిందే. అటు ఆ రాష్ట్రంలో చౌరింగీ, దక్షిణ బరాసత్ అసెంబ్లీ సీట్లకు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు మమతపై చేస్తోన్న విష ప్రచార దాడిని సమర్థంగా ఎదుర్కొని ఆమెకున్న నిజాయతీని రక్షించాలని తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అందుకుగానూ ఆ రాష్ట్ర కాంగ్రెస్, సీపీఐ(ఎం) పార్టీ నేతలు చేసే విమర్శలు, వ్యాఖ్యలను నిలువరించాలని నిర్ణయించింది. ఇటు దేశ వ్యాప్తంగా భారీ ఇమేజ్ తో అధికారంలోకి వచ్చిన బీజేపీ బెంగాల్లోనూ పాగా వేయాలని చూస్తోంది. ఇటీవల బెంగాల్లో పర్యటించిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ, మమత సీఎం పదవి నుంచి వైదొలగాలన్నారు. స్కాంలో సంబంధం ఉన్న వారిని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలన్నారు. 2016లో జరగనున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రస్తుత స్కాం ఆరోపణలను ఉపయోగించుకోవాలని కమలం అధినేత వ్యూహం పన్నుతున్నారు.

  • Loading...

More Telugu News