: ఇంకా ప్రారంభం కాని ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర
ఖైరతాబాద్ గణేశుడి శోభా యాత్ర ఇంకా ప్రారంభం కాలేదు. ట్యాంక్ బండ్ లో మిగతా గణనాథుల విగ్రహాల నిమజ్జనం పూర్తి కాకపోవడంతో ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్రను పోలీసులు నిలిపివేశారు. ఎంజే మార్కెట్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఇంకా వందలాది విగ్రహాలు నిమజ్జనం కోసం వెయిటింగ్ లో ఉన్నాయి. ఈ సమయంలో, వేలాది మంది భక్తులతో సాగే ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైతే... ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయన్న ఉద్దేశంతో పోలీసులు ఈ శోభాయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ట్యాంక్ బండ్ దగ్గర కాస్త ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత ఖైరతాబాద్ గణేశుడి యాత్రకు అనుమతి ఇవ్వాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో, ఖైరతాబాద్ గణేశుడి శోభా యాత్ర ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.