: రాజీకి రా, పోలీసులను ఆశ్రయించవద్దు: వీసీ


కోల్ కతాలోని విశ్వభారతి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుశాంత్ దత్తా గుప్తాపై విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆగస్టులో యూనివర్సిటీలోని కళాభవన్ లో ఫైన్ ఆర్ట్స్ మొదటి సంవత్సరం చదువుతున్న సిక్కింకు చెందిన విద్యార్థినిపై ముగ్గురు సీనియర్ విద్యార్థులు లైంగిక వేధింపులకు పాల్పడి, తమ ఘనకార్యాన్ని వీడియో తీసి, డబ్బులు కావాలంటూ బ్లాక్మెయిల్ చేసిన సంగతి తెలిసిందే. వారు ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారు. అయితే ఆ కేసును ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో రాజీకి రావాలని, పోలీసులను సంప్రదించవద్దని తనపై వైస్ ఛాన్సలర్ గుప్తా ఒత్తిడి తెచ్చారని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ జరుపుతున్నారు. కాగా, సీనియర్లపై ఫిర్యాదు చేసిన విద్యార్థినిపై వీసీ విరుచుకుపడ్డారని ఆరోపణలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News