: వ్యభిచారం చేస్తూ బుక్కయిన మరో సినిమా నటి


వ్యభిచారం కేసులో అరెస్టై, రెస్క్యూ హోంలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్న శ్వేతాబసు ప్రసాద్ ఉదంతం మరిచిపోకముందే మరో సినిమా నటి వ్యభిచారం కేసులో పోలీసులకు పట్టుబడింది. 'బీటెక్‌ బాబు' అనే చిన్న సినిమాలో ఓ పాత్ర పోషించిన యువతిని, మరో ఆరుగుర్ని వ్యభిచారం కేసులో గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు నగర శివారు ప్రాంతమైన స్వర్ణభారతినగర్ మూడో లైనులో నిర్మానుష్యంగా ఉండే ప్రాంతంలో ఓ ఇంటిని ఓ ఆర్గనైజర్ అద్దెకు తీసుకుని నెలరోజులుగా వ్యభిచార గృహం నడుపుతున్నట్లు యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్ సీఐ, రూరల్ సీఐకి పక్కా సమాచారం అందింది. దీంతో టీంతో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. దీంతో ఏడుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన టీవీ ఆర్టిస్టు ఎం.చందు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీహెచ్ పవన్‌లతోపాటు బీటెక్ బాబు సినిమాలో హీరోయిన్‌కు స్నేహితురాలిగా నటించిన యువతి ఉన్నారు. వ్యభిచార గృహాన్ని సామ్రాజ్యం, మరో యువతి నిర్వహిస్తున్నారు. విటులు గుంటూరుకు చెందిన వి.వెంకటరామిరెడ్డి, రాజాగారితోటకు చెందిన శ్రీనివాసరావులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నగరంలో ఎక్కడైనా వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని నగరవాసులను కోరారు.

  • Loading...

More Telugu News