: సింగపూర్ ప్రతినిధులతో కేసీఆర్ భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఈ సాయంత్రం సింగపూర్ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. సింగపూర్ మంత్రి గోచౌక్ తదితరులతో ఆయన హైదరబాదు గ్రాండ్ కాకతీయ హోటల్లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులు పెట్టడం వంటి అంశాలపై కేసీఆర్ వారితో చర్చించారు. కేసీఆర్ తో పాటు ఈ భేటీలో రాష్ట్ర సర్కారు తరపున ఉప ముఖ్యమంత్రి మహ్మద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా పాల్గొన్నారు. కాగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సింగపూర్ ప్రతినిధులతో ఈ ఉదయం సమావేశమై పలు అంశాలపై చర్చించారు.