: ఐఎస్ఐఎస్ మిలిటెంట్ల చేతిలో అమెరికా ఆయుధాలు!


ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మిలిటెంట్ గ్రూపు అమెరికా తయారీ ఆయుధాలు వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. లండన్ కు చెందిన చిన్నతరహా ఆయుధాల పరిశోధన సంస్థ 'కాన్ ఫ్లిక్ట్ ఆర్మమెంట్ రీసెర్చ్' చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఐఎస్ఐఎస్ మిలిటెంట్లతో దాడుల సందర్భంగా ఇరాక్ లోని కుర్దు సాయుధులు కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో అమెరికా తయారీ ఎం16 అస్సాల్ట్ రైఫిళ్ళ సహా పలు తేలికపాటి ఆయుధాలు కనిపించాయి. ఇవన్నీ కూడా ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు ఇరాక్, సిరియా బలగాల నుంచి స్వాధీనం చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. గతకొన్ని నెలలుగా ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు ఇరాక్, సిరియా సైనికులను బందీలుగా పట్టుకుని ఊచకోత కోయడం తెలిసిందే.

  • Loading...

More Telugu News