: ఫేస్ బుక్ వాడనిదే ఉండలేకపోతున్నారా? అయితే మీకు మూడినట్టే... !
ఫేస్ బుక్ కు బానిసయ్యారా? ఫేస్ బుక్ ఓపెన్ చేయకపోతే బుర్ర పని చేయడం లేదా? అయితే, మీరు ప్రమాదంలో పడినట్టే! ఫేస్ బుక్ కు బానిసగా మారితే మీరు తీవ్ర ఒత్తిడిలో పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫేస్ బుక్ వల్ల బంధాలు పెంచుకోవడం, సంబంధాలు పునరుద్ధరించుకోవడం, మన ఆలోచనలు పది మందితో పంచుకోవడం వంటి ప్రయోజనాలున్నాయి. ఫేస్ బుక్ తో అంటీ ముట్టనట్టు ఉన్నంత వరకే ఈ ప్రయోజనాలుంటాయి! అలా కాకుండా, ఫేస్ బుక్కే ప్రపంచం, ఫేస్ బుక్ లేకపోతే ఏమీ తోచడం లేదు అనే స్థాయిలో ఫేస్ బుక్ తో అనుబంధం పెంచుకుంటే మాత్రం ప్రాథమిక అవసరాలకు సంబంధించి జీవితంపై అసంతృప్తి పెరగడం, లేదా మూడ్ పాడవడం వంటి లక్షణాలు ఏర్పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫేస్ బుక్ కు, మూడ్ పాడవడానికి మధ్య సంబంధముందని మానసిక శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఫేస్ బుక్ యూజర్లపై నిర్వహించిన మూడు దశల పరిశోధనల అనంతరం వారు ఈ అభిప్రాయం వెల్లడించారు. ఫేస్ బుక్ తో గడిపిన అనంతరం మూడ్ పాడవడం, ఫేస్ బుక్ క్లోజ్ చేయగానే ఒంటరితనం అనుభవించడం జరుగుతుందని చాలా మంది చెప్పారని పరిశోధకులు తెలిపారు.