: మోడీ 'స్వదేశీ' ప్రచారానికి రాజమౌళి సపోర్ట్
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళికి సామాజిక స్పృహ మెండు. ఆయన సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో సినిమా విషయాలకంటే, సామాజిక అంశాలపైనే ఎక్కువగా స్పందిస్తుంటారు. తాజాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన 'స్వదేశీ' ప్రచారానికి మద్దతు పలికారు. ఈ మేరకు మోడీ సందేశాన్ని తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. 'స్ప్రెడ్ ద వర్డ్' పేరిట ఈ దర్శకధీరుడు చేసిన షేర్ కు లైక్స్ వెల్లువెత్తాయి. చైనా వస్తువులు భారత్ ను ముంచెత్తుతున్నాయని, దీంతో, చైనీయులు లాభపడుతున్నారని ప్రధాని మోడీ భావిస్తున్నారు. తత్ఫలితంగా భారతీయ వ్యాపారులు నష్టాలు చవిచూస్తున్నారని, ఈ పరిస్థితిని అరికట్టాలని మోడీ సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. భారతీయులంతా స్వదేశీ తయారీ వస్తువులనే కొనాలని, స్థానిక తయారీదారులను ప్రోత్సహించి, భారత ఆర్థిక ప్రగతికి తోడ్పడాలని ప్రధాని పిలుపునిచ్చారు.