: వినాయకుని లడ్డును వేలంలో సొంతం చేసుకున్న ముస్లిం!


గణనాథుని నిమజ్జనం రోజున వరంగల్‌లోని డాక్టర్స్‌ కాలనీ-2 లో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఓ సంఘటన జరిగింది. స్థానికంగా ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపం వద్ద ఈ రోజు నిర్వహించిన వేలంలో... అదే కాలనీకి చెందిన రియాజ్‌ అనే ముస్లిం పాల్గొని రూ.51,786లకు లడ్డు ప్రసాదాన్ని సొంతం చేసుకున్నాడు. రియాజ్‌ లడ్డును సొంతం చేసుకోవడం పట్ల ఆ కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. వినాయకుని లడ్డును రియాజ్‌ భక్తులందరికి పంచిపెట్టాడు.

  • Loading...

More Telugu News