: 'టాప్-20'లోకి దూసుకువచ్చిన రైనా


ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ లో విశేషంగా రాణించి 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డు కొట్టేసిన టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్ మన్ సురేశ్ రైనా ఐసీసీ ర్యాంకింగ్స్ లో మరింత పైకి చేరుకున్నాడు. ఏకంగా ఎనిమిది స్థానాలు ఎగబాకి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకుల జాబితాలో రైనా 19వ స్థానంలో ఉన్నాడు. సిరీస్ లోని రెండో వన్డేలో 75 బంతుల్లోనే 100 పరుగులు చేశాడీ యూపీ యువకిశోరం. రైనా సిరీస్ మొత్తమ్మీద 53.33 సగటుతో 160 పరుగులు సాధించాడు. ఇక, టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ర్యాంకుల్లో ఆరో స్థానంలో ఉండగా, ఓపెనర్ శిఖర్ ధావన్ మూడు స్థానాలు ఎగబాకి ఏడో స్థానంలో నిలిచాడు.

  • Loading...

More Telugu News