: ఆసక్తి రేపుతున్న బాలాపూర్ లడ్డూ వేలంపాట


బాలాపూర్... హైదరాబాదు శివారులోని చిన్న గ్రామం. అయితేనేం... గణేష్ లడ్డూ వేలంపాట ఆ గ్రామ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. హైదరాబాదులోని ఖైరతాబాద్ వినాయకుడికి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో... బాలాపూర్ లడ్డూ వేలంపాటకు కూడా అంతే పాప్యూలారిటీ ఉంది. గణేష్ నిమజ్జనం రోజున బాలాపూర్ లడ్డూను ఎవరు సొంత చేసుకుంటారు? ఎంతకు సొంతం చేసుకుంటారు? అనే అంశం అందరిలోనూ ఆసక్తిని రేపుతుంది. మరో ముఖ్య విషయం ఏమిటంటే, బాలాపూర్ లడ్డూ వేలంపాటలో ముస్లింలు సైతం పాల్గొంటారు. తొలిసారి 1994లో బాలాపూర్ లడ్డూను వేలం వేయడం ప్రారంభించారు. ఆ ఏడాది కేవలం రూ. 450కి లడ్డూ అమ్ముడుపోయింది. అయితే, ఏడాదికేడాదికీ లడ్డూ వేలం పెరుగుతూనే ఉంది. పోయిన ఏడాది హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి రూ. 9.26 లక్షలకు లడ్డూను వేలంపాటలో సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది రూ. 10 లక్షల వరకు వేలంపాట కొనసాగవచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. గణపతి లడ్డూను సొంతం చేసుకున్న వారికి అంతా మంచే జరుగుతుందన్న బలమైన నమ్మకం భక్తుల్లో ఉంది.

  • Loading...

More Telugu News