: నేడు కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ కు బైపాస్ సర్జరీ
కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ కు ఈ రోజు బైపాస్ సర్జరీ జరగనుంది. గత నెల 30 న స్వల్పంగా గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. శస్త్రచికిత్స అవసరమని వైద్యులు నిర్ధారించడంతో ఆయన నిన్న గుర్గావ్ లో ఉన్న మేదాంత ఆసుపత్రిలో చేరారు. ఈ రోజు బైపాస్ సర్జరీ నిర్వహిస్తారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. 1999 లో కూడా ఆయన గుండెపోటుకు గురయ్యారు. అప్పట్లో విశాఖలోని కేర్ ఆసుపత్రిలో చేరి చికిత్సపొందారు.