: ప్రతిపక్ష నేత లేకుండానే కీలక నియామకాలకు కేంద్రం మొగ్గు!


జాతీయ స్థాయిలో కీలక పదవులైన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘం, లోక్ పాల్ తదితర నియామకాలను పూర్తి చేసేందుకు మోడీ సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. అయితే ఈ నియామకాలకు సంబంధించిన నిర్ణయాల్లో లోక్ సభలో ప్రతిపక్ష నేత అభిప్రాయం కీలకం. అయితే ప్రస్తుతం లోక్ సభలో ప్రతిపక్ష నేత పదవి ఏ పార్టీకి దక్కలేదు. కీలక నియామకాల్లో జరుగుతున్న జాప్యంపై స్పందించిన కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల లోక్ సభ సెక్రటేరియట్ కు లేఖ రాసింది. ప్రతిపక్ష నేత ఎవరూ లేరంటూ ఆ లేఖకు లోక్ సభ సెక్రటేరియట్ సమాధానమిచ్చిన నేపథ్యంలో ఇక కీలక నియామకాలు చేపట్టేందుకు దాదాపు రంగం సిద్ధమైనట్టేనన్న ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటికే పలు అంశాలపై మోడీ సర్కారు అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్, తాజా పరిస్థితిపై ఏ విధంగా స్పందిస్తుందోనన్న అంశం ఆసక్తికరంగా మారింది.

  • Loading...

More Telugu News