: హెచ్ సీఏ ఏజీఎం భేటీలో బూతు పురాణం


హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏజీఎం భేటీలో బూతు పురాణం చోటుచేసుకుంది. హెచ్ సీఏ అధ్యక్షుడు జి. వినోద్ నేతృత్వంలో ఆదివారం జరిగిన భేటీలో కొందరు సభ్యులు అసభ్య పదజాలంతో అధ్యక్షుడిపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా కొందరు సభ్యులు తిట్ల దండకాన్ని అందుకున్నారు. దీంతో కంగుతిన్న వినోద్, తీవ్రంగా ప్రతిస్పందించారు. అసభ్యకర పదాలు వల్లిస్తే మూడేళ్ల పాటు నిషేధం విధించక తప్పదని హెచ్చరించారు. అయినా సభ్యులు శాంతించకపోవడంతో భేటీని గురువారానికి వాయిదా వేశారు. హెచ్ సీఏ కార్యవర్గ ఎన్నికల అనంతరం జరిగిన ఈ భేటీ, వినోద్, అర్షద్ అయూబ్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదానికి వేదికైంది.

  • Loading...

More Telugu News