: మలయాళీలకు ప్రధాని ఓనం పండుగ శుభాకాంక్షలు
ఓనం పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మలయాళీలకు శుభాకాంక్షలు తెలిపారు. మోడీ తన సందేశంలో మలయాళీ సోదర, సోదరీమణులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సమృద్ధి, సంతోషాలతో ప్రజలు ఈ పండుగ చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కేరళ యొక్క గొప్ప సంస్కృతి, వారసత్వ సంపదలను ఈ పండుగ తెలియజేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా ఈ పండుగను మలయాళీలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. మహాబలి చక్రవర్తి ఓనం పండుగ రోజున తన ప్రజలను కలుసుకునేందుకు ఆత్మరూపంలో వస్తాడని కేరళవాసుల నమ్మకం. మహాబలి చక్రవర్తిని తమ ఇళ్లకు ఆహ్వానించడానికి ఈ పండుగను జరుపుకుంటారు. కేరళలో పండిన పంటలు ఈ నెలలోనే ఇళ్లకు చేరతాయి.