: సరైన తరుణంలో పుంజుకున్నారు: గంగూలీ
మాజీ సారథి సౌరవ్ గంగూలీ టీమిండియా తాజా ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. మరికొద్ది నెలల్లో వరల్డ్ కప్ జరగనుండగా, భారత్ సరైన సమయంలో పుంజుకుందని వ్యాఖ్యానించాడు. ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ ను చేజిక్కించుకున్న నేపథ్యంలో... ధోనీ సేన వరల్డ్ కప్ టైటిల్ ను నిలబెట్టుకుంటుందన్న నమ్మకం కలుగుతోందని తెలిపాడు. ప్రస్తుత భారత జట్టు కూర్పు సరిగ్గా అమరిందని ఈ ప్రిన్స్ ఆఫ్ కోల్ కతా అభిప్రాయపడ్డాడు. నాణ్యమైన ఆటతీరును కనబర్చినంత కాలం గెలుస్తుంటారని అన్నాడు. అయితే, చివరి ఓవర్లలో బౌలింగ్ చేయడంపై భారత బౌలర్లు శ్రద్ధ వహించాలని సూచించాడు. ఈరోజుల్లో... ప్రతి బౌలర్ ను ఆఖరి ఓవర్లలో చితక్కొడుతున్నారని అభిప్రాయపడ్డాడు.