: నటితో 'ముద్దు'కు రూ.49 లక్షలు చెల్లించిన భారత సంతతి వ్యాపారవేత్త
బ్రిటీష్ మోడల్, నటి ఎలిజబెత్ హర్లీ (49)ని ముద్దు పెట్టుకునేందుకు ఓ భారత సంతతి వ్యాపారవేత్త కళ్ళుచెదిరే మొత్తాన్ని చెల్లించుకున్నాడు. ఎల్టన్ జాన్ ఎయిడ్స్ ఫౌండేషన్ కు నిధుల సేకరణ నిమిత్తం ఈ 'వేలానికి ముద్దు' కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎవరు ఎక్కువ చెల్లిస్తే వారు హర్లీని ముద్దుపెట్టుకోవచ్చని నిర్వాహకులు ప్రకటించారు. ఈ వేలంలో కెనడాకు చెందిన జూలియన్ భార్తీ (27) అందరికంటే అత్యధికంగా రూ.49 లక్షలు చెల్లించి 'కిస్' చాన్సు కొట్టేశాడు. జూలియన్ ప్రఖ్యాత 'ఫోర్బ్స్ అండ్ మాన్ హట్టన్' సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో స్టాన్ భార్తీ పెద్ద కుమారుడు. ఇక, హర్లీ గురించి తెలిసిందే. ఆస్ట్రేలియా లెగ్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ తో నిన్నమొన్నటి వరకు ప్రేమాయణం సాగించి వార్తల్లో నిలిచింది. అంతకుముందు, ఆమె తన భారతసంతతి భర్త అరుణ్ నాయర్ కు విడాకులిచ్చేసింది. కాగా, జూలియన్ స్పందిస్తూ, తాను హర్లీని కిస్ చేయడంపై తన భార్య ఏమీ అనుకోదని భావిస్తున్నట్టు తెలిపాడు.