: ముంబయిలో వర్మపై క్రిమినల్ కేసు
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై ముంబయిలో క్రిమినల్ కేసు నమోదైంది. గణేశుడిపై ట్విట్టర్ లో వర్మ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమంటూ ఇండస్ కమ్యూనికేషన్స్ ఎండీ వివేక్ శెట్టి అంధేరి మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న కోర్టు సెప్టెంబర్ 30న విచారణ జరపనున్నట్టు తెలపింది. వర్మ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని శెట్టి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.