: మనుషులకు, రాక్షసులకు తేడా మానవత్వమే: జగన్


ఇంత దారుణమైన రాజకీయాలను తానెప్పుడూ చూడలేదని వైఎస్సార్సీపీ నేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో బీసీలపై తీర్మానం పెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికార పక్ష సభ్యులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. అధికార పక్ష నేతలకు మానవత్వం ఉందా? లేదా? అనే విషయం తరచి చూసుకోవాలని ఆయన సూచించారు. బీసీల గురించి మాట్లాడితే అడ్డు తగులుతారా? అని ఆయన మండిపడ్డారు. బీసీలపై సశాస్త్రీయమైన చర్చ జరగాలని ఆయన తెలిపారు. గత ప్రభుత్వాలు బీసీలకు ఏం చేశాయి? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? అనే వాటిపై చర్చించాల్సిన అవసరం లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఈ దశలో సభలో అధికారపక్ష సభ్యులు ఆందోళన చేశారు.

  • Loading...

More Telugu News