: కీలక ఆసుపత్రులన్నీ హైదరాబాదులోనే ఉండిపోయాయి: మంత్రి కామినేని
రాష్ట్ర విభజన సందర్భంగా కీలక ఆసుపత్రులు, వైద్య సౌకర్యాలన్నీ హైదరాబాదులోనే ఉండిపోయాయని ఏపీ వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, క్యాన్సర్ ను నిర్థారించి, నయం చేసే కీలక వైద్య విభాగాలన్నీ హైదరాబాదులో ఉండిపోవడంతో ఏపీలో సరైన వైద్యం అందడం లేదని అన్నారు. క్యాన్సర్ ఆసుపత్రి కొరత తీర్చేందుకు అనంతపురం, నెల్లూరు, గుంటూరుల్లో రేడియేషన్ సెంటర్లు పెట్టేందుకు కేంద్రానికి లేఖ రాశామని ఆయన వెల్లడించారు.