: ఇండియన్ ముజాహిద్దీన్ కీలక సభ్యుడు పట్టివేత


ఇండియన్ ముజాహిద్దీన్ కు సాంకేతిక నిపుణుడుగా పనిచేస్తున్న కీలక సభ్యుడు అజీజ్ షేక్ ను ఢిల్లీ పోలీసులకు చెందిన ప్రత్యేక సెల్ పట్టుకుంది. ఉత్తరప్రదేశ్ లోని సహ్రాన్ పూర్ లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. పూణెలో కాల్ సెంటర్ లో పని చేస్తున్న అజీజ్ 2009 నుంచి నకిలీ ఐడెంటిటీ కార్డు, పత్రాలతో ఐఎమ్ ఆపరేటివ్స్ కు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక ఐఎమ్ చేసిన జామా మసీద్ దాడి సహా పలు దాడుల్లో అతనికి ప్రమేయం ఉన్నట్లు చెబుతున్నారు. తాజాగా పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో దాడికి ముజాహిద్దీన్ గ్రూప్ ప్లాన్ వేసిన నేపథ్యంలో అతడిని అరెస్టు చేసినట్లు పోలీసుల సమాచారం. కాగా, గత రెండేళ్లలో ముజాహిద్దీన్ కు చెందిన కీలక వ్యక్తులు తెహసీన్ అక్తర్, అంతేగాక సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భక్తల్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో అజీజ్ దొరకడం ఐమ్ కు పెద్ద దెబ్బేనని అంటున్నారు.

  • Loading...

More Telugu News