: ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుండడంపై కాంగ్రెస్ విమర్శలు


ఢిల్లీలో భారతీయ జనతా పార్టీని ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఆహ్వానించేందుకు అనుమతివ్వాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) రాష్ట్రపతికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దాంతో, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉండడంపై కాంగ్రెస్ ఎదురు దాడికి దిగింది. ఓటర్లు ఇచ్చే తీర్పుకు భయపడే ఇలా చేస్తున్నట్లు వ్యాఖ్యానించింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మనీష్ తివారీ మీడియాతో మాట్లాడుతూ,"డిసెంబర్ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఒకవేళ వారు ప్రజలకు భయపడకుంటే లెఫ్టినెంట్ గవర్నర్ చేత మిగతా రాష్ట్రాల్లాగే ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించాలని వారు ఎందుకు సిఫారసు చేయలేదు?" అని ప్రశ్నించారు. వీటిపై వెంటనే ఢిల్లీ బీజేపీ స్పందించి ఆరోపణలు ఖండించింది. మళ్లీ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని, గెలుస్తామన్న నమ్మకం కూడా ఉందని స్పష్టం చేసింది. ఒకవేళ తమను ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఎల్జీ ఆహ్వానిస్తే పార్టీ నిశితంగా పరిశీలిస్తుందని చెప్పింది.

  • Loading...

More Telugu News