: జూబ్లిహిల్స్ లో హిజ్రా హల్ చల్


హైదరాబాదు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ ప్రాంతం... తెల్లవారుజాము సమయం... ముంబైకి చెందిన సీమా అనే హిజ్రా నీట్ గా తయారై ఓ కారువాలాను లిఫ్ట్ అడిగాడు. అతను కారాపడంతో హిజ్రా ఠక్కున ఎక్కి కూర్చున్నాడు. ఆ వెంటనే కారు ఓనర్ మెడలోని చైన్ లాక్కుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. దాంతో అతను గట్టిగా అరవడంతో, అక్కడే డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనిని గమనించిన హిజ్రా చైన్ కారులో పడేసి పారిపోయాడు. ట్రాఫిక్ పోలీసులు వెంబడించి పట్టుకునేందుకు ప్రయత్నించగా వారిపై రాళ్లు విసిరాడు. పోలీసులు పట్టుకోవడంతో తాను చైన్ దొంగిలించలేదని దబాయించాడు. అతడ్ని పోలీసు ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News