: కదిలేటప్పుడు రంగులను గుర్తించడంలో మతలబు!
మెదడు పనితీరుపై జరుగుతున్న పరిశోధనలు కొత్త విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి. ముఖ్యంగా ఫుట్ బాల్ ఆటగాళ్లు వేగంగా పరుగెత్తుతూనే, దుస్తుల రంగులను బట్టి తమ జట్టు సభ్యులను గుర్తించి, బంతిని అందించడం వెనుక మతలబును అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కనిపెట్టారు. మన మెదడు ఇంత వేగంగా వస్తువుల రంగులను ఎలా గుర్తిస్తుంది? కదులుతున్న వస్తువుల్లో మనకు కావాల్సిన వస్తువులను ఎలా ఎంచుకుంటుంది? అన్న విషయాలను తెలిపారు. రంగుల సమ్మేళనాలను, కదలికలను గ్రహించడానికి మెదడులో ప్రత్యేకమైన నాడీకణాల సముదాయం తోడ్పడుతున్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.