: ఆస్ట్రేలియాతో అణు ఒప్పందం చేసుకున్న భారత్


ఆస్ట్రేలియాతో భారత్ అణు ఒప్పందం చేసుకుంది. యురేనియం సహకారంపై భారత్, ఆస్ట్రేలియా దేశాలు సంతకాలు చేశాయి. ఒప్పందాలపై ఇరు దేశాల ప్రధానులు మోడీ, టోనీ అబ్బాట్ లు సంతకాలు చేశారు. భారత్ లో ఆస్ట్రేలియా ప్రధాని రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. భారత్ వైద్యరంగానికి విస్తృత సహకారం అందిస్తామని టోనీ అబ్బాట్ అన్నారు. ఆస్ట్రేలియాతో అణు సహకార ఒప్పందం చారిత్రక మైలురాయి అని ప్రధాని మోడీ అన్నారు. భారత్ నుంచి చోరీకి గురైన కళాఖండాలను అప్పగించిన అబ్బాట్ కు ఈ సందర్భంగా మోడీ కృతఙ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News