: కొత్త రాజధాని ప్రకటనను కేంద్రం స్వాగతిస్తుంది: వెంకయ్య నాయుడు
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ప్రకటనను కేంద్రప్రభుత్వం స్వాగతిస్తుందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడను రాజధానిగా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విభజన చట్టానికి లోబడి, కొత్త రాజధానికి సహకారం అందిస్తామని వెంకయ్యనాయుడు చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య కేంద్రం ఎలాంటి వివక్షను చూపబోదని ఆయన స్పష్టం చేశారు.