: కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తిన తుమ్మల నాగేశ్వరరావు
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తుమ్మల నాగేశ్వరరావు పొగడ్తలతో ముంచెత్తారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నో మార్పులకు కేసీఆర్, తానే మూలమని అన్నారు. కేసీఆర్ నేతృత్వంలోనే బంగారు తెలంగాణ సాకారమవుతుందని తుమ్మల అన్నారు. కేసీఆర్ స్వాగతాన్ని మన్నించి టీఆర్ఎస్ లో చేరుతున్నానని, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామి కావాలనే పార్టీలో చేరుతున్నానని ఆయన చెప్పారు. పోలవరం ముంపు మండలాలను ఆంధ్రాలో కలపడం అన్యాయమని ఆయన అన్నారు.