: హైదరాబాదు శాస్త్రవేత్తకు రాయల్ సొసైటీ ఫెలోషిప్


హైదరాబాదులోని 'కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్'- 'ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ' (సీఎస్ఐఆర్-ఐఐసీటీ)లో చీఫ్ సైంటిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ బి.మహిపాల్ రెడ్డికి రాయల్ సొసైటీ ఫెలోషిప్ లభించింది. ఇక్కడ ఇనార్గానిక్ ఫిజికల్ కెమిస్ట్రీ విభాగానికి అధిపతిగా పనిచేస్తున్న మహిపాల్ రెండు దశాబ్దాలుగా 'బేసిక్ అండ్ అప్లైడ్ సైన్స్'లో పరిశోధనలు చేస్తున్నారు. ఈ అత్యుత్తమ పరిశోధనకుగాను గుర్తింపు లభించడంతో ఆయనను ఫెలోషిప్ తో సన్మానించినట్లు సీఎస్ఐఆర్-ఐఐసీటీ ఓ ప్రకటనలో తెలిపింది.

  • Loading...

More Telugu News