: ఇరు రాష్ట్రాల డీజీపీలతో ముగిసిన గవర్నర్ భేటీ


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల డీజీపీలు, సలహాదారులతో గవర్నర్ నరసింహన్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అల్ ఖైదా, ఐఎస్ఐఎస్ కదలికలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. హైదరాబాదు, సైబరాబాద్ సీపీలు అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ చెప్పారు. ఎప్పటికప్పుడు తనిఖీలు, నిఘా పెంచాలని గవర్నర్ నరసింహన్ సూచించారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించాలని గవర్నర్ ఆదేశించారు. యువత ఉగ్రవాదం వైపు మళ్లకుండా చూడాలని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News