: లీడ్స్ వన్డేలో రూట్ హాఫ్ సెంచరీ
లీడ్స్ వన్డేలో రూట్ హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. ఆదిలో ఇంగ్లండ్ బ్యాట్ మెన్ తడబడినా, తర్వాత నెమ్మదిగా నిలదొక్కుకున్నారు. రెండు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన రూట్ మెల్లిగా ఆడుతూ ఇంగ్లండ్ స్కోరును సెంచరీ దాటించాడు. 69 బంతుల్లో 51 పరుగులను చేసిన రూట్ 6 ఫోర్లను తన ఖాతాలో వేసుకున్నాడు. రూట్ తో పాటు బుట్లర్ క్రీజులో కొనసాగుతున్నారు. 33.3 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్ 140/4.