: వైజాగ్ లో పరిశ్రమలకు భూమి కొరత ఉంది: ఎంపీ హరిబాబు
విశాఖపట్టణంలో పరిశ్రమలు పెట్టేందుకు భూమి కొరత ఉందని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయని అన్నారు. విశాఖలో భూమి లభ్యతపై ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ)ను కోరామని ఆయన తెలిపారు. విశాఖ మెగాసిటీగా అభివృద్ధి చెందుతుందని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. నిజాంపట్నం, రేపల్లె మధ్య ఫార్మా రంగాన్ని అభివృద్ధి చేస్తామని, ఫార్మా సిటీ అనుమతుల కోసం కేంద్రానికి లేఖ రాశామని అన్నారు.