: రాజకీయాలు వృత్తి కాదు...సేవ: మోడీ
‘కష్టమైన రాజకీయాలను మీరు సమర్థవంతంగా నడపగలుగుతున్నారు. మరి, రాజకీయాలను వృత్తిగా స్వీకరించవచ్చా?’ అంటూ బాలిక ప్రధానికి ప్రశ్న సంధించింది. ఆమెకు సమాధానమిస్తూ రాజకీయాలు వృత్తి కాదని స్పష్టం చేశారు. రాజకీయాలంటే సేవ అని ఆయన తెలిపారు. తన కుటుంబం చాలా పెద్దదని, అందులో 120 కోట్ల మంది సభ్యులున్నారని ఆయన వెల్లడించారు. ఇంత పెద్ద కుటుంబంలో ప్రజల సమస్యలన్నీ తనవేనని, వారి సుఖమే తన సుఖం అని, వారి కష్టమే తన కష్టం అని సమాధానమిచ్చి మోడీ పిల్లలు, పెద్దల మనసులు గెలుచుకున్నారు. దేశ సేవలో రాజకీయాలు ఒక భాగమని ఆయన స్పష్టం చేశారు. విద్యార్ధులు ఉత్తమ విద్యార్థులుగా నిరూపించుకుని దేశానికి సేవ చేయాలని ఆయన సూచించారు. మన అలవాట్లలో వచ్చిన మార్పులే వాతావరణంలో చోటుచేసుకున్నాయని ఆయన తెలిపారు.