: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల డీజీపీలతో గవర్నర్ సమావేశం


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల డీజీపీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో గవర్నర్ నరసింహన్ సమావేశమయ్యారు. అంతేగాక హోంశాఖ అధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. రాజ్ భవన్ లో జరుగుతున్న ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల శాంతిభద్రతల అంశంపై చర్చిస్తున్నారు. విభజన చట్టం ప్రకారం అత్యంత ముఖ్యమైన సమయాల్లో శాంతిభద్రతలపై గవర్నర్ సమీక్షించి, కలుగజేసుకునే అవకాశం ఉంది. అందులో భాగంగానే గవర్నర్ శాంతిభద్రతలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News