: యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ లో సానియా జోడీ ఓటమి
యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ సెమీఫైనల్లో భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, జింబాబ్వే క్రీడాకారిణి కారాబ్లాక్ జోడీ ఇంటిముఖం పట్టింది. స్విస్-ఇటాలియన్ జోడీ మార్టినా హింగిస్, ఫ్లవియా పెన్నెట్టాపై వరుస సెట్లలో ఓడిపోయారు. లూయిస్ ఆర్మ్ స్ట్రాంగ్ లో జరిగిన గంటా పదినిమిషాల మ్యాచ్ లో 2-6, 4-6తో సానియా, కారా జోడీ మ్యాచ్ ను కోల్పోయింది. కానీ, ఇదే టోర్నమెంట్ లో మిక్స్ డ్ డబ్సుల్ లో ఫైనల్లో ఉన్న సానియా, బ్రూనో సొరెస్ జోడీ పతకాన్ని గెలిచే అవకాశముంది.