: బ్లాక్ మార్కెటింగ్ వ్యాపారులను నేనెప్పుడూ వ్యతిరేకిస్తా: బీహార్ సీఎం మాంఝీ


ప్రజలకు నిత్యావసర వస్తువులను దూరం చేస్తూ, బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడే వ్యాపారులను తాను సమర్థించలేదని, అయితే అవగాహనా లోపంతో అలా చేసే వారి పట్ల సానుభూతితో వ్యవహరించాలన్నదే తన అభిప్రాయమని బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రాంమాంఝీ చెప్పారు. ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ సమక్షంతో జరిగిన ఓ సమావేశంలో మాంఝీ ప్రసంగిస్తూ.. కుటుంబ పోషణ కోసమో, పిల్లలను చదివించుకునేందుకో సరుకులను నల్లబజారుకు తరలించే చిన్న వ్యాపారులపై చర్యలు తీసుకోవద్దని చెప్పారు. మాంఝీ వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేతలు ఆయన రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మాంఝీ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. సరుకులను అక్రమంగా దాచి, కృత్రిమ కొరత సృష్టించి, ధరలను పెంచడం క్షమార్హం కాని నేరమని, దానిని తానెప్పుడూ వ్యతిరేకిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదన్నారు.

  • Loading...

More Telugu News