: కేసీఆర్ ఢిల్లీకి వచ్చి పనులు చేయించుకోవడం లేదెందుకు?: బండారు దత్తాత్రేయ


తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం సహకరించడం లేదన్న టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను బీజేపీ సీనియర్ నేత, సికింద్రాబాదు ఎంపీ బండారు దత్తాత్రేయ ఖండించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం, మంత్రులు కేంద్రంపై అభాండాలు వేయడం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాలుగుసార్లు ఢిల్లీకి వచ్చి పనులు చేయించుకుంటున్నారని, తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వచ్చి ఎందుకు పనులు చేయించుకోవడం లేదని దత్తాత్రేయ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. వినతిపత్రం, నివేదికలు ఇవ్వకుండా ఎవరైనా పనులు చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News