: అత్యంత పలుచని, అతి తేలికైన ల్యుమియా ఫోన్ ని ఆవిష్కరించిన నోకియా


మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ నోకియా అత్యంత పలుచగా ఉండే ఫోన్ ను ఆవిష్కరించింది. అతి తేలికైన ల్యుమియా 830 మోడల్ ను నోకియా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ నెలలోనే ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు నోకియా పేర్కొంది. 8.5 మి.మీ. మందం ఉన్న ఈ ఫోన్ ధర రూ.26,200. విండోస్ 8.1 వర్షన్ తో పనిచేసే ఈ ఫోన్ లో 10 ఎంపీ కెమెరా, 1ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 5 అంగుళాల స్ర్రీన్ తో పాటు 1 జీబీ ర్యామ్, 1.2 గిగాహెడ్జ్ స్నాప్ డ్రాగన్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ కలిగి ఉంటుంది.

  • Loading...

More Telugu News