: ప్రధాని అయితేనేం... వంట చేస్తారు, చెత్తబయట పారేస్తారు!
ప్రధాని అయితే ఏం మనుషులు కాదా? పనులు చేయరా? అని ఇడియట్ సినిమాలోలా అనకండి. ఎందుకంటే, ప్రధాని అంటే నిత్యం కనిపెట్టుకుని ఉండే సేవకులు, భద్రత సిబ్బంది, ఇంట్లో విధులు నిర్వర్తించేందుకు సిబ్బంది... ఇలా రాజభోగాలు వుంటాయి. కానీ, జపాన్ ప్రధానికి ఇంటి పనులు చేసేందుకు పని మనుషులు అక్కర్లేదు. ఆయన వంట చేస్తారని, చెత్త బయటపారేస్తారని జపాన్ ప్రధాని షింజో అబె భార్య అకీ అబె తెలిపారు. జపాన్ లో మహిళలు పలు రంగాల్లో దూసుకుపోవడానికి కారణం పురుషులు సహకరించడమేనని ఆమె స్పష్టం చేశారు. ఇంట్లో సమయం దొరికినప్పుడల్లా తనకు సహాయం చేస్తుంటారని ఆమె తెలిపారు. ఆయన రోజంతా బయట ఉంటే తనకు పనితో తీరిక ఉండదని ఆమె చెప్పారు. షింజో అబె భర్తగా ఏనాడూ ఆధిపత్యం చెలాయించలేదని అకీ అబె తెలిపారు.