: రాజస్థాన్ గవర్నరుగా కల్యాణ్ సింగ్ ప్రమాణస్వీకారం
బీజేపీ సీనియర్ నేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ రాజస్థాన్ గవర్నరుగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సునీల్ అంబ్వానీ జైపూర్ రాజ్ భవన్ లో కల్యాణ్ సింగ్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింధియా, అసెంబ్లీ స్పీకర్ కైలాశ్ మేఘ్ వాల్ తదితరులు హాజరయ్యారు.