: మమతా బెనర్జీ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్


శారదా చిట్ ఫండ్ స్కామ్ కు సంబంధించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. 2010లో ఐఆర్ సీటీసీ నుంచి శారదా గ్రూప్ కాంట్రాక్టు పొందేందుకు సీఎం నుంచి అనుమతి రూపంలో సాయం లభించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధి అధిర్ రంజన్ కోల్ కతాలో మీడియాతో మాట్లాడుతూ, నిజాయతీ, చిత్తశుద్ధికి చిరునామా అయిన మమతాను సీఎం పదవి నుంచి వైదొలగాలని కోరుతున్నామన్నారు. మీరు (మమతా) చిత్తశుద్ది పరులైతే ఈ స్కాం కేసులో సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చేవరకు పదవికి దూరంగా ఉండాలని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News